మీ ఆరోగ్యానికి మీరే బాధ్యులు...

ఒక సంవత్సరం గడిచిపోయింది  కోవిడ్ 1 9  మనకు ఎన్నో గుణ పాఠాలు నేర్పింది. అసలు మన ఆరోగ్యం విషయంలో 2030 నాటికీ మన ఆరోగ్య సంరక్షణ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అబ్భివృద్ధి చెందుతున్న దేశాల్లో  సైతం ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.  ప్రజలు, వ్యక్తులు తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రజా ఆరోగ్యంపై సంస్థలు వినియోగదారుడికి సేవలు అందించేందుకు సిద్ధం కావాలని ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవల్సిన అవసరం మరింత పెరిగిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వాలు చేస్తున్నది ప్రజలకు చేరడం లేదనేదనే వాస్తవం. కోవిడ్ తరువాత  ఆరోగ్యరంగానికి ప్రభుత్వాలు పెద్దపీట వేసినప్పటికీ ఆరోగ్య విద్య, పరిశోధనలకు మాత్రమే నిధులు కేటాయించారు.

అయితే రూరల్ హెల్త్ , ఆర్బన్ హెల్త్ పై దృష్టి పెట్టినప్పటికీ సామాన్యుడికి  వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. ప్రభుత్వాలకు ప్రజా ఆరోగ్యం పై ఒక విధానం అంటూ ఉండాలి.. అయితే కేవలం కరోనా వ్యాక్సిన్ ఇచ్చాం.. అది మాత్రమే బాధ్యత అనుకుంటే సరిపోదు. దీర్ఘకాలంగా  ప్రజలకు భారంగా మారుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ విషయంలో ప్రభుత్వం ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకోక తప్పని స్థితి, అసలు ప్రజా ఆరోగ్యానికి అయ్యే ఖర్చు  ప్రభుత్వం భరిస్తుందా లేదా? చవకగా ఆరోగ్యం పొందగాలమా? కోవిడ్ తరువాత సాధారణ మధ్య తరగతి ప్రజలు ఆర్ధికంగా పూర్తిగా చితికిన నేపధ్యంలో ఆరోగ్యం ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. ప్రజా ఆరోగ్యం ఎవరు మానీటర్ చెయ్యాలి?  ఎవరు నిర్వహించాలి? ఇంట్లో ఆరోగ్య సంరక్షణ సాధ్యమేనా? ఎవరికీ అసుపత్రిలో సేవలు అవసరం? వీటిని ఎలా నిర్ధారిస్తారు? ఎవరికి చికిత్స చేస్తారు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది..ఇక రిమోట్ హోం హెల్త్ సొల్యుషన్స్ లేదా టేలి మెడిసిన్, హోం ల్యాబ్, హోం వ్యాక్సినేషన్, హోం హెల్త్ మా నీటరింగ్ ఖర్చు తో కూడుకున్నది. 

అటు ధర్మఅసుపత్రి లో రోగులను పట్టించుకోరు, ప్రైవేటు ఆసుపత్రిలో బాగానే ఉన్న ఆ ఖర్చు తట్టుకోడం మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది. అందుకే ఎవరి ఆరోగ్యానికి వాళ్ళే బాధ్యులు అనుకోక తప్పని స్థితి వాస్తవానికి కోవిడ్ కు ముందు కోవిడ్ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎప్పటికీ ట్రేస్, ట్రీట్ ఉండల్సిందేనా? డిజిటల్ హెల్త్ ఉన్నప్పటికీ ఇతర ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారించడం సాధ్యమేనా? ప్యాండమిక్ సమయంలో తీసుకున్న జాగ్రత్తలు ఎప్పటికీ తిస్కోవల్సిందేనా.. తీసుకున్న అనారోగ్య సమస్య నుంచి తప్పించుకోడం సాధ్యమా? ప్రజలు ఇక ప్రాత్యమ్నాయ వైద్యం కోసం చూసుకోక తప్పదా? సంప్రదాయ వైద్యం సిద్ధాంతాలు ఆచరించక తప్పదా? ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో ఉన్న స్వయంరక్షణ ఎప్పటికీ తప్పదా? సహాజంగా వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు మళ్ళీ మనం బలికాకతప్పదా ? అన్నసందేహం ప్రజలను వేదిస్తున్నాయి? నీ నెత్తి మీద ఎదో ఉందంటే నువ్వే తీయి అన్నట్లు  మీ ఆరోగ్యానికి మీరే బాధ్యులు మాకు సంబంధం లేదని ప్రభుత్వాలు అంటాయా? వేచి చూద్దాం.