సుష్మా లవ్ స్టోరీ...ఆరోజుల్లోనే సంచలనం !

 

బీజేపీ సీనియర్ నేత, విదేశాంగశాఖ మాజీ మంత్రి సుష్మా‌స్వరాజ్ కన్ను మూసిన సంగతి తెలిసిందే. భాజపాలో మూడు దశాబ్దాలుగా ఆమె కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే ఆమె ప్రేమ వివాహం గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావనకు వస్తోంది. చండీగడ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలోనే సుష్మా స్వరాజ్ మరియు స్వరాజ్ కౌషల్ లు కలుసుకున్నారట. వీరిద్దరూ 13 జూలై 1975 న వివాహం చేసుకున్నారు. 

అయితే ప్రేమ వివాహం కోసం వారి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఇద్దరూ చాలా కష్టపడాల్సి వచ్చిందట. సుష్మా స్వరాజ్ ప్రేమ వివాహం చేసుకున్న సమయంలో హర్యానాకు చెందిన ఒక అమ్మాయి ప్రేమ వివాహం గురించి ఆలోచించడమే చాలా పెద్ద విషయం. కానీ 25 సంవత్సరాల వయస్సులో హర్యానా క్యాబినెట్ మంత్రిగా బాద్యతలు చేపటిన సుష్మాకు ఈ ధైర్యం ఉంది కాబట్టే ఆమె ఇంట్లో ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకుంది. 

స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టులో పేరొందిన న్యాయవాది. ఆయన తన 34 ఏళ్ల వయసులోనే అత్యంత పిన్నవయస్కుడైన యువ అడ్వకేట్ జనరల్‌గా పేరొందారు. స్వరాజ్ కౌశల్ తన 37 ఏళ్ల వయసులో మిజోరం గవర్నర్‌గా బాధ్యలు చేపట్టారు. ఆ పదవిలో ఆయన 1990 నుంచి 1993 వరకూ ఉన్నారు. అయితే మొన్న జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇండోర్‌లో విలేకరుల ప్రసంగం చేస్తున్నప్పుడు, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీ చేయనని విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ ప్రకటించారు. 

సుష్మా స్వరాజ్ తీసుకున్న ఈ నిర్ణయం విషయంలో ఆమె భర్త ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్‌ లో ఒక పోస్ట్ చేస్తూ పోటీ చేయకూడదనే మీ నిర్ణయానికి ధన్యవాదాలు రేసు ఈ రేసు 1977 లో ప్రారంభమైంది. ఇప్పుడు 41 సంవత్సరాలు అయ్యింది. మీరు ఇప్పటివరకు 11 ఎన్నికలలో పోటీ చేశారు. 1991 మరియు 2004 సంవత్సరాల్లో రెండుసార్లు ఎన్నికలలో పోటీ చేయలేదు, ఎందుకంటే పార్టీ మిమ్మల్ని ఎన్నికల రంగంలోకి అనుమతించలేదు. నేను గత 46 సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాను. ఇప్పుడు నాకు 19 సంవత్సరాలు కాదు కాస్త చూడండి మేడమ్ అంటూ పోస్ట్ చేశారు. ఆయన అన్నట్టుగానే ఆమె ఆ ఎన్నికలకి రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా కన్నుమూశారు.