అమెజాన్ కు సుష్మా వార్నింగ్‌..

Publish Date:Jan 12, 2017

 

విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ అమెరికా ఈ-కామ‌ర్స్ సైట్ అమెజాన్ కు వార్నింగ్ ఇచ్చారు. సుష్మా ఇచ్చిన వార్నింగ్ తో అమెజాన్ దిగొచ్చింది. అసలు సంగతేంటంటే.. మన జాతీయ జెండాతో చేసిన డోర్‌మ్యాట్ల‌ుగా అమ్మకానికి పెట్టడంతో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుష్మా.. త్రివ‌ర్ణ ప‌తాకం థీమ్‌తో ఉన్న డోర్‌మ్యాట్ల‌ను సైట్ నుంచి తొల‌గించి బేష‌రతుగా క్ష‌మాప‌ణ చెప్పాలని.. లేదంటే అమెజాన్ అధికారుల‌కు ఇండియా వీసాలు ద‌క్క‌వని.. గ‌తంలోజారీ చేసిన వీసాల‌ను కూడా ర‌ద్దు చేస్తాం అంటూ గ‌ట్టిగానే వార్నింగిచ్చారు.  కెనడాలోని భార‌త హైక‌మిష‌న్‌కు తెలియజేస్తూ ఈ విషయాన్ని ఇది అస‌లు ఏమాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని, అత్యున్న‌త‌స్థాయిలో అమెజాన్ దృష్టికి ఈ విష‌యం తీసుకెళ్లాల‌ని స్ప‌ష్టంచేశారు. దీంతో కొద్ది గంటలలోనే ఆ ఐట‌మ్‌ను సైట్ నుంచి తొల‌గించిన‌ట్లు అమెజాన్ అధికార ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు.

By
en-us Politics News -