చరిత్రలో మొదటిసారి.. సుప్రీంజడ్జిల ప్రెస్ మీట్.. చీఫ్ జస్టిస్ పై అసంతృప్తి

 

ఇటీవల సుప్రీంకోర్టులో ఎన్నడూ జరగని విషయాలు చోటుచేసుకుంటున్నాయి. చరిత్రలో మొదటిసారిగా.. సుప్రీం కోర్టు జడ్జిలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సుప్రీం చీఫ్ జస్టిస్ పైన అసంతృప్తితో ఉన్న జడ్జిలు.. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సుప్రీం కోర్టులో పాలనా వ్యవహారాలు సరిగా సాగడం లేదని...కోర్టులో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి...సమస్యలను పరిష్కరించాలని తాము ప్రధాన న్యాయమూర్తిని చాలాసార్లు అడిగాం.. అయినా ప్రయోజనం లేదు.. అందుకే తాము ప్రజల ముందుకు వచ్చామని చెప్పారు. స్వతంత్రంగా వ్యవహరించే ప్రధాన న్యాయమూర్తి అవసరమని... తాము అత్యవసర పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడవలసి వస్తోందని..  జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉంది... సుప్రీం పవిత్రతను కాపాడకుంటే ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అన్నారు.సుప్రీంలో పాలనా వ్యవహారాలు సరిగా సాగడం లేదన్నారు. ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలా లేదా అనేది దేశ ప్రజలు తెలియజేయాలన్నారు.