భార్యా భర్తలు ఇక ఆగాల్సిన అవసరం లేదు...

 

హిందూ సంప్రదాయంలో వివాహానికి ఉన్న ప్రాధాన్యత వేరు.  కానీ ఇటీవల కాలంలో పెళ్లైన కొన్నాళ్లకే పెళ్లి పెటాకులు అవుతున్నాయి. ఒకరినొకరు అర్దం చేసుకోకుండా విడాకులు తీసుకుంటున్నారు. అలాంటి విడాకుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై విడాకులు మంజూరు చేయడానికి ముందు తప్పనిసరిగా ఆరునెలల రాజీ గడువును పాటించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇప్పటివరకూ భార్య భర్తలిద్దరూ విడాకులు  కోరితే వెంటనే ఇచ్చేయకుండా.. వారు మళ్లీ రాజీ పడి కలిసి జీవించే అవకాశం ఏదైనా ఉంటుందేమో అన్న కారణంతో గడువు ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు అలాంటి గడువులతో పనిలేకుండా సుప్రీం నిర్ణయం తీసుకుంది. దంపతులకు ఒకేఇంటిలో నివసించే ఉద్దేశం లేకపోతే ఆ గడువును ట్రయల్ కోర్టు రద్దు చేయవచ్చని తెలిపింది. భార్యభర్తలు విడిపోతామని నిర్ణయించుకున్నాక, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ జీవించే అవకాశం లేనప్పుడు ఆరు నెలల కూలింగ్ పిరియడ్ నిబంధనను పాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ట్రయల్ కోర్టులు వారికి వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని సూచన చేసింది.