కేంద్రం నిర్ణయాన్ని ఆపలేం...

 

కేంద్రం ఫిబ్రవరి 1 న ఎలాగైన కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే పరోక్ష పార్టీలు మాత్రం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టకూడదని డిమాండ్ చేస్తున్నాయి. ఇక దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.  ఎంఎల్ శర్మ అనే అడ్వొకేట్ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. ముందుగా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఆపలేమని స్పష్టం చేసింది. కేంద్రం చర్యను ఆపేందుకు తమకు ఎలాంటి చట్టం కనిపించలేదని, ఒక వేళ మీ వాదనకు మద్దతుగా అలాంటి చట్టం ఉన్నదని మీరు భావిస్తే, ఆ సంగతి తమకు తెలియజేయాలని వారు పిటిషనర్‌కు సూచించారు.

 

కాగా ప్రతిఏటా ఫిబ్రవరి ఆఖరు వారంలో కేంద్రం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. కానీ.. ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరి  1 న బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని చూస్తుంది. దీంతో ఎన్నికల నేపథ్యంలో కావాలనే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆందోళన చేస్తున్నారు.