అంత సీన్ లేదు.. అయన జస్ట్ ఎమ్మెల్యే: బాబుకు సుజనా షాక్

 

టీడీపీ పార్టీ ద్వారా రెండు సార్లు ఎంపీ గా, అలాగే కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు సుజనా షాక్ ఇచ్చారు. నిన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ మూడేళ్ళలోనే జమిలి ఎన్నికలు వస్తాయని చెప్పిన విషయం తెలిసిందే. ఇదే అంశం పై ఈ రోజు సుజనాను మీడియా ప్రశ్నించినపుడు ఆ విషయం బాబు ఎలా చెప్తారంటూ ప్రశ్నించారు. జమిలి ఎన్నికల పై మాట్లాడే స్థాయిలో బాబు లేరని ప్రస్తుతం అయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే అని అన్నారు. ఐతే జమిలి ఎన్నికల పై తన వద్ద ఎటువంటి సమాచారం లేదని సుజనా తెలిపారు.