సుజనా, అశోక్ గజపతిరాజు రాజీనామాలు ఆమోదించిన రాష్ట్రపతి..


టీడీపీ కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజుల రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం మోడీ నివాసానికి వెళ్లి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. ఇక వీరిద్దరి రాజీనామాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు. రాజీనామాలను ఆమోదించాలని కోరుతూ ప్రధాని సంతకం చేసిన లెటర్ రాష్ట్రపతికి చేరడంతో.. ఆయన వీటిపై సంతకం చేశారు. ప్రస్తుతానికి వీరిద్దరి శాఖలూ ప్రధాని వద్దే ఉంటాయని, ఎవరికీ అదనపు బాధ్యతలు ఇవ్వడం లేదని ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.