మిస్టరీ విప్పిన పోస్ట్ మార్టం రిపోర్ట్

 

మొన్న సోమవారంనాడు డిల్లీలో ఇండియాగేట్ వద్ద జరిగిన అల్లర్లలో పోలీసు కానిస్టేబుల్ సుబాస్ చoద్ తోమార్ (47) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో జేర్చబడి మృతి చెందిన విషయం తెలిసినదే. అతను అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్మ్ఆద్మీపార్టీ కార్యకర్తల దాడిలోనే మరణించాడని కాంగ్రెస్ పార్టీ ఆరోపించడమే కాకుండా ఆ పార్టీ తన కార్యకర్తలని డిల్లీలో అరాచక పరిస్తితులు సృష్టించేందుకు ప్రేరేపిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. డిల్లీ పోలీసులు ఎనిమిది మంది యువకులను తమ అదుపులోకి తీసుకొని విచారణ కూడా ప్రారంబించారు. అందులో ఒకరు ఆమ్మ్ఆద్మీపార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పేర్కొంటోంది. అతనిని విడిపించేందుకు ఆ పార్టీ నేతలు డిల్లీ పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి కూడా తెస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అయితే, ఆ ఆరోపణలన్నిటినీ అరవింద్ కేజ్రీవాల్ వెంటనే ఖండించారు.

 

ఇదిలాఉండగా, అల్లర్లలో అశువులు భాసిన అమరవీరుడిగా డిల్లీ పోలీసుశాఖ అతనికి అదికార లాంచనాలతో అత్యక్రియలు నిర్వహించడమే గాకుండా, అతని కుటుంబములో ఒకరికి పోలీసు శాఖలో ఉద్యోగం, అతని కుటుంబానికి భారీనష్ట పరిహారం కూడా ప్రకటించింది.

 

అయితే, కొద్ది గంటలక్రితం వెలువడిన పోస్ట్ మార్టంలో అతని శరీరంపై తీవ్రగాయాలున్న గుర్తులున్నపటికీ, వాటివల్ల మాత్రం అతను మరణించలేదని పోస్ట్ మార్టం నివేదిక బయటపెట్టింది. అతనికి ఆసుపత్రిలో ఉండగా, గుండె పోటు వచ్చినందువల్లనే మరణించాడని డాక్టర్లు తమ రిపోర్టులో తెలిపారు.