రమణదీక్షితులు కేరాఫ్ క్రిస్టియన్ సంస్థలు

రమణ దీక్షితులు.. ఈమధ్య ఈ పేరు బాగా పాపులర్ అయింది.. టీటీడీ ప్రధాన అర్చకులుగా పని చేసిన రమణ దీక్షితులు.. రిటైర్ అయ్యాక టీటీడీ మీద, ప్రభుత్వం మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు.. శ్రీవారికి పూజ చేసి పుణ్యం తెచ్చుకున్నారో లేదో తెలీదు కానీ టీటీడీ మీద, ప్రభుత్వం మీద విమర్శలు చేసి బోలెడంత పబ్లిసిటీ తెచ్చుకున్నారు.. తాజాగా రమణ దీక్షితులు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ మీద ఆరోపణలు చేసారు.. దీనిలో కొత్త ఏముంది కామనేగా అంటారా?.. ఆరోపణలు కామనే కానీ ఆ సమావేశం ఆర్గనైజ్ చేసిన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తే కొన్ని ప్రశ్నలకు కారణమయ్యారు.. ఇతను ఓ క్రిస్టియన్ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారట.. సైమన్ అమృత్ ఫౌండేషన్ పేరుతో మత ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారట.

అలాంటి అతను రమణ దీక్షితులు సమావేశంలో అన్నీ తానై అన్నట్టుగా వ్యవహరించారు.. అంతేకాదు శ్రీవారి సేవల గురించి మాట్లాడుతూ బాధపడ్డారు.. క్రిస్టియన్ చారిటీ సంస్థను నిర్వహిస్తూ, మత ప్రచారం చేసే వ్యక్తితో రమణ దీక్షితులు సమావేశం ఏర్పాటు చేసి టీటీడీపై ఆరోపణలు చేయడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. కొందరైతే ఒక అడుగు ముందుకేసి రమణ దీక్షితులు వెనక విపక్షాలే అనుకున్నాం, మత సంస్థలు కూడా ఉన్నాయా అంటూ ఆరోపణలు చేస్తున్నారు.. చూద్దాం ఈ విషయం గురించి రమణ దీక్షితులు ఎలా స్పందిస్తారో.