నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

 

గత మూడు రోజులుగా నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు.. నిన్న కాస్త కోలుకున్నాయి అనుకునేలోపే.. ఈరోజు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు  ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 57 పాయింట్లు నష్టపోయి 29,365 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 17 పాయింట్లు కోల్పోయి 9,119 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా షేర్లు లాభపడగా.. సన్‌ఫార్మా, విప్రో, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, అదానీపోర్ట్స్‌, గ్రాసిమ్‌ షేర్లు నష్టపోయాయి.