నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

 

గత రెండు రోజులుగా లాభాలలో నిలిచిన స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. యూపీ ఎన్నికలు, అమెరికా ఫెడ్‌ రేట్లు అంతగా ప్రభావం చూపకపోవడంతో గతవారం భారీ లాభాలను ఆర్జించిన స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 130 పాయింట్లు కోల్పోయి 29,519 వద్ద ముగిసింది. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 9,127 వద్ద స్థిరపడింది. ఇక, వొడాఫోన్‌తో విలీనం నేపథ్యంలో ఐడియా షేర్లు భారీగా పడిపోయాయి. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛ్‌ంజ్‌లో ఐడియా షేర్లు 10శాతం నష్టపోయాయి.