4 వారాల గడువొద్దు: హోంశాఖ

 

 

తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చకు మరో నాలుగువారాలు గడువు కావాలని రాష్ట్రప్రభుత్వం రాష్ట్రపతిని కోరింది. దీనిపై రాష్ట్రపతి హోంశాఖ అభిప్రాయం కోరగా...రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు రాష్ట్రపతి నాలుగు వారాల గడువిస్తే మాత్రం పార్లమెంట్ సమావేశాలు వచ్చే 21తో ముగుస్తున్నందున తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ఆస్కారం ఉండదని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి.


ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నాలుగు వారాల అదనపు గడువిస్తే ఆ తర్వాత ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి పార్లమెంట్ సమావేశాలు ముగిసే అవకాశముంది. సాధారణంగా ఓటాన్ అకౌంట్ సమావేశాలే చివరివి. ఈ ప్రభుత్వ హాయంలో మరోసారి పార్లమెంట్ సమావేశాలకు అవకాశం లేనందున ఇప్పుడే బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. అయితే గడువు పెంచరాదని, తెలంగాణ నేతలు పార్టీలకు అతీతంగా కోరుతున్నారు. కాంగ్రెస్ నేతలు, టిడిపి ఎమ్మెల్యేలు దీనిపై లేఖలు రాశారు.