సోనియా ప్రమాణస్వీకారం.. వైసీపీ ఎంపీల అభినందన

 

యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు అభినందనలు తెలిపారు. మంగళవారం లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణం స్వీకారం చేయడానికి సోనియాగాంధీ తన సీటు నుంచి వెల్‌ వద్దకు వస్తున్న సమయంలో.. కాంగ్రెస్‌, డీఎంకే, ఎన్సీపీ, తృణమూల్‌ ఎంపీలతోపాటు వైసీపీ సభ్యులు రఘురామ కృష్ణంరాజు, తలారి రంగయ్యలు కూడా బల్లలపై చేతులు చరిచి అభినందనలు తెలిపారు. సోనియా హిందీలో ప్రమాణం చేస్తుండగా తనయుడు రాహుల్‌గాంధీ మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించారు. ‘హిందీలో ప్రమాణం చేసినందుకు సోనియాగాంధీకి శుభాకాంక్షలు’ అంటూ బీజేపీ సభ్యులు కొందరు వ్యాఖ్యానించారు.