కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష...

 

ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ దాదాపు అన్ని ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టింది. ఇక బీజేపీ పార్టీపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు కూడా అదే రకంగా గుప్పించాయి. ఇప్పుడు ఏకంగా దీక్షే చేయాలని నిర్ణయించుకుంది కాంగ్రెస్ పార్టీ. అధికారం కోసం బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తుందని ఆరోపిస్తుంది. ఈనేపథ్యంలోనే... బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ కీలక నేతలందరూ పాల్గొననున్నారు. అంతేకాదు.. ఈ దీక్షకు అన్ని పార్టీల నేతలు హాజరుకావాలని.. వారికి ఆహ్వానాలు పంపుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.