తూచ్... రాజకీయాల నుండి తప్పుకోవట్లేదు...

 

సోనియా గాంధీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే అదంతా తూచ్ అని చెప్పింది పార్టీ. రాజ్యసభ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న సోనియాను..  ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో పార్టీలో మీ పాత్ర ఎలా ఉంటుంది?’ అనే ప్రశ్న వేయగా,‘ నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని ప్రకటించారు. అంతే అప్పటినుండి ఈ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఆమె రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని, కేవలం పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని ఆ పార్టీ ప్రకటించింది.