రాజుగారు ముందుంది అసలు పండగ..

 

మొత్తానికి ఏపీకి బీజేపీ అధ్యక్షుడిని నియమించింది పార్టీ అధిష్టానం. ఇన్ని రోజులు ఏపీ బీజేపీ బాధ్యతలు ఎవరికిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ సోము వీర్రాజుకి ఆ బాధ్యతలు బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును నియమించినట్టు తెలిపింది. త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. ఈ విషయంలో ఎంపీ హరిబాబు వర్గం విభేదించినా.. చివరికి వీర్రాజు వైపు అమిత్ షా మొగ్గు చూపారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవాలంటే ఇలాంటి లీడర్ అవసరం అని భావించి.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. అంతేకాదు... ఏపీలో బలమైన నేతలుగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలు కూడా వీర్రాజు వైపే మొగ్గుచూపారట. పురంధేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగినా.. ఆమే వద్దన్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో నేను పార్టీ పగ్గాలు స్వీకరించలేను అని తెలిపారంట. ఇక కన్నా కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవటంతో సోము వీర్రాజుకే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో పార్టీ పటిష్ఠంపై దృష్టాలని యాక్షన్ ప్లాన్ తో ఓ నివేదిక కూడా వీర్రాజుకి అందజేసినట్లు తెలుస్తోంది.

 

మరి అసలే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఇప్పటికే బీజేపీ అంటే రగిలిపోతున్నారు ఏపీ జనాలు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని... వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ది చెప్పాలని ఇప్పడికే నిర్ణయం తీసుకున్నారు తెలుగు ప్రజలు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు గారు అంత పెద్ద బాధ్యతను నెత్తిన పెట్టుకున్నారు. ఇక సోము వీర్రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడే ఆయన టీడీపీపై ఓ రేంజ్ లో విమర్సలు గుప్పించారు. విడిపోయిన తరువాత అయితే ఏకంగా చంద్రబాబునాయుడిపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఇప్పుడు ఏకంగా.. రాజుగారికి అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు ఇంకా రెచ్చిపోతారేమో.. అందుకే బీజేపీ వీర్రాజు ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న్టట్టుంది అంటున్నారు. మిగిలిన వాళ్లు ఎలాగూ ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటో తెలుసుకాబట్టి అందుకే సైలెంట్ గా తప్పుకున్నట్టున్నారు అని కూడా అనుకుంటున్నారు. మరి బీజేపీపై ఇంత వ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లో సోము వీర్రాజు ఎలా ప్రజల్లోకి వెళతారో చూద్దాం....