ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీని ముంచేసిన 'ఆ' మీడియా!!

 

మీడియా అనేది.. ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే ప్రశంసించాలి. తప్పు చేస్తే ప్రశ్నించాలి. అధికార, ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి. అయితే ఇప్పుడు మీడియా సంస్థలు కొన్ని పార్టీల సొంత సంస్థలుగా మారిపోయి నిజాలను దాస్తున్నాయి. కొందరు నాయకులను ముంచుతున్నాయి. సరిగ్గా చంద్రబాబు విషయంలో కూడా ఇదే జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొన్ని తెలుగు మీడియా సంస్థలు గత ఐదేళ్ళలో బాబు ఏమి చేసినా పొగడటమే పనిగా పెట్టుకున్నాయి. బాబు ఏమి చేసినా ఆహా ఓహో అనడం, బాబు ఏది చేస్తే అదే కరెక్ట్ అన్నట్టు చెప్పడం చేసాయి. అసలు బాబు పాలన మీద, పార్టీ మీద ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందనే విషయాన్ని నిజాయితీగా తెలియజేసే ప్రయత్నమే చేయలేదు. అదేమంటే బాబు పొగడ్తను తీసుకున్నట్టు విమర్శను తీసుకోరు. ఆయన్ని పొగిడితే పక్కన పెట్టుకుంటారు, ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టినా, విమర్శించినా శత్రువుగా చూస్తారు అందుకే మేము భజన చేశామని కొందరు మీడియా అధినేతలు చెబుతున్నారు. మొత్తానికి ఆ మీడియా భజన వల్ల ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత.. బాబుకి తెలియకుండా పోయింది. పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మరి బాబు ఇకనైనా పొగడ్తతో పాటు విమర్శ కూడా తీసుకొని మళ్ళీ గాడిలో పెడతారేమో చూడాలి.