దేవుడా పాముతో మసాజ్... ఎక్కడ..?

 

సాధారణంగా మనుషులతో మసాజ్ చేయిస్తుంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా పాముతోనే మసాజ్ చేయిస్తున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఈ మసాజ్ చేసేది ఎక్కడనుకుంటున్నారా..? జర్మనీలో.  అసలుసంగతేంటంటే.. జర్మనీకి చెందిన ఫ్రాంక్‌ డొహ్లన్ అనే వ్యక్తి ఓ హెయిర్ సెలూన్ న‌డుపుతున్నాడు. అయితే అతనికి ఒక రోజు పాము దొరికిందట. దానికి మాంటీ అను పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. అయితే తనకి ప్రతి రోజూ తాను చేస్తున్న మ‌సాజ్‌ను మాంటీతో చేయించాల‌నే ఆలోచ‌న ఆయ‌న‌కు రావ‌డంతో దానితో మసాజ్ చేయించడం ప్రారంభించాడట. ఇంకేముంది పాము కూడా చక చకా అందరికీ మసాజ్ చేసేస్తుందట. ఆ పాము క‌స్ట‌మ‌ర్ల‌ శరీరానికి చుట్టుకొని గట్టిగా అదుముతూ ఉంటుంది. అంతేకాదు పాము మసాజ్ వల్ల  ఒళ్లు నొప్పులు అన్ని తగ్గుపోతాయని  క‌స్ట‌మ‌ర్లు కూడా పాముతోనే మసాజ్ చేయించుకుంటున్నారట.