ఎస్ఎంఎస్ పుట్టి 25 సంవత్సరాలు

షార్ట్ మేసేజ్ సర్వీస్ అంటే అర్థం కావడం లేదా..? ఎస్ఎంఎస్ అంటే టక్కున గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడంటే వాట్సాప్, ఫేస్‌బుక్, హైక్ వంటి మేసేజ్ సర్వీసులు వచ్చాయి కానీ ఒక దశాబ్ధం క్రితం ఏదైనా సమాచారాన్ని పంపించాలంటే ఎస్ఎంఎస్‌నే ఉపయోగించేవారు. అయితే అరచేతిలోనే మొత్తం భూగోళాన్ని ఇముడ్చుకున్న స్మార్ట్‌ఫోన్‌లు ఎప్పుడైతే మనిషికి దగ్గరయ్యాయో అప్పటి నుంచే ఎస్ఎంఎస్ దూరమైంది. అయినప్పటికీ ఇంకా కొంతమంది ఎస్ఎంఎస్‌లు వాడుతున్నారు. అంతటి చరిత్ర కలిగిన ఎస్ఎంఎస్ సర్వీసులు ప్రారంభమై నేటికి సరిగ్గా పాతికేళ్లు. 1992 డిసెంబర్ 2న తొలి ఎస్ఎంఎస్ వెళ్లింది. మేరీ క్రిస్మస్ అనేది తొలి సందేశం. పాప్‌వర్త్ ఎస్ఎంఎం సృష్టికర్త. మొబైల్ ఫోన్ దిగ్గజం నోకియా 1993లో ఎస్ఎంఎస్ సర్వీసును పంపుకొనే ఫీచర్ ఉన్న హ్యాండ్‌సెట్‌ను ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ తర్వాత నెట్‌వర్క్ ఆపరేటర్స్ ఆకర్షణీయమైన ఎస్ఎంఎస్ ఆఫర్లతో నాటి యువతను తమవైపుకు తిప్పుకున్నారు.