స్పాట్ లోనే ప్రాణాలు తీసేస్తున్న కొత్త గేమ్.. ట్రెండ్ అవుతోన్న స్కల్ బ్రేకింగ్...

మీరిప్పటివరకు ఆన్ లైన్ గేమ్స్‌... పబ్‌జీ, బ్లూ వేల్, మోమో చాలెంజ్... బర్త్‌డే బంప్స్‌....లాంటి గేమ్స్ మాత్రమే చూసుంటారు. లేదా, సరదా సరదాగానే కాళ్లతో తన్నడం.... విపరీతంగా కొట్టడం లాంటి ఆటలు చూసి ఉంటారు. కానీ, ఇప్పుడు స్కూళ్లూ, కాలేజీల్లో కొత్త గేమ్ ట్రెండింగ్ అవుతోంది. ఇది అలాంటిలాంటి గేమ్ కాదు. ఒక్కసారి ఆడారో చచ్చినట్లే. అంత మోస్ట్ డేంజరస్ గేమ్ ఇది. సరదా కోసం... కాలక్షేపం కోసం... కోసం ఆడే ఆట ఎంత భయంకరమైనదంటే... కనీసం ట్రై చేసినా ప్రాణాలు మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే, అంత ప్రమాదకరం ఈ గేమ్.

స్కల్ బ్రేకింగ్ గేమ్ గా జాతీయ మీడియా పిలుస్తున్న ఈ ఆటలో... ముగ్గురూ కలిసి వరుసగా నిలబడతారు... ముందు, ఆ చివర... ఈ చివర ఉన్నవాళ్లు... పైకి కిందకి ఎరుతారు... ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఎగురుదామని అంటారు... ఇక్కడే గేమ్‌‌లో అసలు ట్విస్ట్‌ ఉంటుంది... మధ్యలో ఉన్న వ్యక్తి పైకి ఎగిరిన వెంటనే... ఇరువైపుల ఉన్న ఇద్దరూ కలిసి... అతని కాళ్లపై తన్నుతారు... అంతే, ఎగురుతున్న వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి పడిపోతాడు. ఇది, వినడానికి, చూడ్డానికి సరదాగానూ... సింపుల్‌గానూ కనిపిస్తున్నా.... వెనక్కిపడినోడి పరిస్థితి మాత్రం అంతే సంగతులు.

పబ్‌జీ లేదా ఆన్ లైన్ గేమ్స్ లో ఆటకు బానిసలై మానసిక స్థిమితం కోల్పోయి మృత్యుబాట పడతారు. బర్త్‌ డే బంప్స్‌‌లాంటి గేమ్స్‌లో సున్నితమైన భాగాల్లో దెబ్బలు తగిలి మరణిస్తారు. అయితే, ఈ గేమ్‌లో అలా కాదు. తల వెనుక భాగం పగిలి స్పాట్‌ డెత్‌ అవుతున్నారు. లేదా, మెదడు, మెడ భాగాలు దెబ్బతిని జీవచ్ఛవాలుగా మారిపోతున్నారు. మరికొందరికి రక్త నాళాలు, మెడ నరాలు తెగిపోయి కాళ్లూ చేతులు చచ్చుబడిపోతున్నాయి. 

స్కూళ్లూ కాలేజీలు హాస్టల్స్‌లో ట్రెండింగ్‌ అవుతున్న ఈ ఆట మోస్ట్ డేంజరస్ గేమ్‌ అంటున్నారు వైద్యులు. వెనక్కి పడిపోవడం కారణంగా తలలో మెదడు దెబ్బతింటుందని... లేదంటే రక్త నాళాలు పగిలిపోతాయని అంటున్నారు. దాంతో, ఆ వ్యక్తి స్పాట్‌లోనే మరణించే అవకాశముంటుందని చెబుతున్నారు. లేదంటే, మెడ నరాలు పగిలిపోయి మొత్తం నాడీ వ్యవస్థే దెబ్బతింటుందని, దాంతో శరీరం మొత్తం చచ్చుబడిపోతుందని అంటున్నారు.

అయితే, ఇలాంటి డేంజర్ గేమ్స్ ఆడకుండా పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రమాదకర ఆటల విషయంలో ముందే పిల్లలను అప్రమత్తం చేయాలని చెబుతున్నారు. ఇక, స్కూళ్లూ కాలేజీల్లోనూ డేంజర్ గేమ్స్ విషయంలో స్టూడెంట్స్‌కు అవగాహన కల్పించాల్సిన అవసరముందంటున్నారు. లేదంటే, సరదా సరదాగా ఆడుకునే ఆటలే పిల్లలు ప్రాణాలు తీసేస్తాయని హెచ్చరిస్తున్నారు.