చెల్లి కోసం ప్రియురాలిని మోసం చేశాడు..!

ఏ అన్న అయినా తన రక్తం పంచుకుని పుట్టిన చెల్లి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాలనుకుంటాడు అందుకోసం ఎప్పటి నుంచో కష్టపడి వివాహ సమయానికి అంతా సిద్ధం చేసుకుంటాడు. అయితే దీనికి విరుద్దంగా మోసం చేసైనా సోదరి పెళ్లి చేయాలనుకున్నాడు ఓ కేటుగాడు. అందుకోసం ప్రేమించిన అమ్మాయినే వంచించాడు. చెన్నైకి చెందిన ఓ యువతికి కాలేజీలో చదువుకుంటున్న సమయంలో మోహన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది..ఇద్దరు సన్నిహితంగా మెలిగేవారు..సినిమాలు, షికార్లు షరా మామూలే.

 

సరిగ్గా ఇదే సమయంలో వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమె వద్ద రూ.10 లక్షలు తీసుకున్నాడు. సమయం గడుస్తున్న కొద్ది మోహన్ వైఖరిలో మార్పు రావడం..తనకు మోహం చాటేస్తుండటంతో అసలు నిజం ప్రియురాలికి తెలిసింది.. ఆ డబ్బుతో మోహన్ తన చెల్లి పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేశాడు..దీంతో మొదట మన వివాహం చేసుకుందామని..ఆ తర్వాత చెల్లెలి వివాహం చేయవచ్చని ఆమె సూచించింది. దీనికి మోహన్ అంగీకరించకపోగా..నిన్ను పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ యువతి తానిచ్చిన రూ.10 లక్షలు తిరిగి ఇవ్వాలని కోరింది. అందుకు అతను సమ్మతించకపోగా..అసభ్యపద జాలంతో దూషించి బెదిరించాడు..దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించడంతో మోహన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.