ముషారఫ్‌కి బూటు దెబ్బలు

 

Shoe thrown at Musharraf in a Pakistan court, Shoe thrown at Musharraf

 

 

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. మద్ధతుదారులతో సింధ్‌ హైకోర్టు బయటకు వస్తుండగా ఆయనపై శుక్రవారం ఓ ఆగంతకుడు బూటు విసిరారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా అందరూ నిశ్చేష్టులయ్యారు. బెయిల్ నిమిత్తమై ముషారఫ్ సింధ్ హైకోర్టుకు హాజరయ్యారు. ఆయనకు కోర్టు 15 రోజులపాటు బెయిల్‌ పొడిగించింది. తీర్పు పూర్తైన అనంతరం కోర్టునుంచి బయటకు వస్తున్న ముషారఫ్పై ఈ దాడి జరిగింది.

 

నాలుగేళ్ల  ప్రవాస జీవితం అనంతరం ఇటీవల ముషారఫ్ స్వదేశానికి వచ్చారు. ఆయన వస్తే తాము చంపేస్తామని తాలిబన్ ఉగ్రవాదులు హెచ్చరించినా ఆయన భయపడలేదు. తీవ్రవాదుల హెచ్చరికలకు తాను భయపడడని ఆయన అన్నారు. అయితే ఆయన వచ్చిన నాలుగురోజులకే ఈ సంఘటన జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయన భారీ భద్రత నడుమనే కోర్టుకు వచ్చారు. అగంతకుడు విసిరిన బూటు కూడా ఆయనకు తగలలేదు.