టి పై నిర్ణయం తీసుకోవచ్చు..తీసుకోకపోవచ్చు

 

shinde telangana, congress cwc meeting, shinde congress

 

 

తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లో ఏకాభిప్రాయం రాకపోతే నిర్ణయం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చునని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. తెలంగాణ సమస్య చాలా ఏళ్ళుగా అంటే 1956 నుంచి పెండింగ్‌లో ఉందని, దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. తెలంగాణకు సంబంధించి ముసాయిదా సిద్ధమయిందని, దానిని సీడబ్ల్యూసీలో ప్రవేశపెడతామని షిండే చెప్పారు.

 

ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని సుశీల్ కుమార్ షిండే తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తెలంగాణపై హస్తినలో కాంగ్రెస్ అగ్రనేతల మంతనాలు ముమ్మరంగా సాగుతున్నాయి.