ప్రపంచకప్ మొత్తానికి దూరమైన శిఖర్ ధావన్!!

 

ప్రపంచకప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచ కప్ మొత్తానికి దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ధావన్ ఎడమచేతి బొటనవేలుకు గాయమైన సంగతి తెలిసిందే. దీంతో, మూడు మ్యాచ్ లకు విశ్రాంతి కల్పించారు. అయితే గాయం నుంచి ధావన్ కోలుకోవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఇతర మ్యాచ్ లు కూడా ధావన్ ఆడే పరిస్థితి లేకపోవడంతో.. ప్రపంచకప్ కు పూర్తిగా దూరమయ్యాడు. ధావన్ స్థానంలో వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ జట్టులోకి వచ్చాడు.