రైల్లో కలకలం.. 18 పిస్తోళ్ల‌ సంచి..

 

రైలులో ఓ గుర్తు తెలియని వ్యక్తి 18 పిస్తోళ్ల‌తో ఉన్న సంచిని వదిలి పెట్టి వెల్లడంతో కలకలం రేగింది. ఈ ఘటన సీల్దా- బలియా ఎక్స్‌ప్రెస్‌లో వెలుగు చూసింది. బలియా స్టేషన్‌లో రోజువారీ సోదాల్లో భాగంగా సాధారణ బోగీలోని బెర్తు కింద స్పోర్ట్స్‌ బ్యాగ్ కనిపించగా అది తెరిచి చూడగా బ్యాగులో 18 పిస్తోళ్లు ఉన్నాయి. అవి ఇంకా పూర్తిగా సిద్ధం కాని స్థితిలో ఉన్నాయి. పిస్తోళ్లతో ఉన్న బ్యాగ్‌ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంచిని ఎవరు పెట్టారా అని దర్యాప్తు చేస్తున్నారు.