ఇదెక్కడి అరాచకం... తేన్పులపై నిషేదం...

 

కొన్ని కంపెనీల్లో సెల్ ఫోన్ ను వాడొద్దన్న నిషేదం ఉంటుంది. అది అంటే వస్తువు కాబట్టి వాడం. లేకపోతే ఏదో బ్యాగులోనో పడేసుకుంటాం. మరి మనకు తెలియకుండా వచ్చే తుమ్ములు, దగ్గులు, ఆవలింతలు కూడా నిషేదం అంటే. వినడానికి విచిత్రంగా ఉంది కదా. విచిత్రంగా ఉన్నా... ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అది కూడా ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఏస్బీఐ ఆఫీసులో ఉద్యోగుల ప్ర‌వ‌ర్త‌న, అల‌వాట్ల గురించి కొత్త ఆదేశాలు జారీచేసింది. ఇందులో ఆఫీసులు తేన్పులు తీయ‌డాన్ని నిషేధించింది. ముఖ్యంగా స‌మావేశాలు జ‌రుగుతున్న‌పుడు, అత్య‌వ‌స‌ర ప‌నుల్లో ఉన్న‌పుడు తేన్పులు తీయ‌కూడ‌ద‌ని ఆదేశించింది. ఇలా చేయ‌డం వ‌ల్ల వినియోగ‌దారుల‌కు, స‌హోద్యోగుల‌కు చిరాకు క‌లిగి ప‌ని మీద దృష్టిసారించ‌లేక‌పోతున్నార‌ని స‌ర్క్యుల‌ర్‌లో వ్యాఖ్యానించింది. దీంతో పాటు టీ ష‌ర్టులు, జీన్స్‌, స్పోర్ట్స్ షూస్ వేసుకురావ‌డంపై కూడా ఎస్‌బీఐ నిషేధం విధించింది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పనిచేసే సీనియ‌ర్ పురుష ఉద్యోగులు, క‌స్ట‌మ‌ర్ల‌ను క‌లిసిన‌పుడు సెమీ-ఫార్మ‌ల్ ధ‌రించి, టై క‌ట్టుకోవాల‌ని సూచించింది. సీనియ‌ర్ మ‌హిళా ఉద్యోగులు ఫార్మ‌ల్ భార‌తీయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో గానీ, ఫార్మ‌ల్ పాశ్చాత్య వ‌స్త్ర‌ధార‌ణ‌లో గానీ ఉండాల‌ని పేర్కొంది. డ్రస్సింగ్ లో అంటే రూల్స్ పెట్టినా తప్పేంలేదు. ఏదోలా వేసుకుంటారు. కానీ సహజంగా వచ్చే తేన్పులు తీయొద్దు అంటే.. పాపం వాళ్లు మాత్రం ఏం చేస్తారు. అవేమన్నా చెప్పి వస్తాయా...