సుప్రీం ఆదేశాలు కూడా బేఖాతరు... కత్తులు కట్టేశారు..

 

సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది కోడిపందేలు. ముఖ్యంగా.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పండుగరోజు పెద్దఎత్తున కోడి పందేలు జరుగుతాయి. కొన్ని కోట్ల రూపాయల బెట్టింగులు కూడా జరుగుతాయి. అయితే ఈ కోడిపందేలపై సుప్రీంకోర్టు కొన్ని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే కదా. కోడి పందేలు జరుగుతున్నప్పుడు కోళ్ల కాళ్లకు కత్తులు కట్టకూడదని నిబంధనలు విధించాయి. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు అయ్యాయి. పోలీసుల హెచ్చరికలు గాల్లో కలిసిపోయాయి. భోగి పండుగ సందర్భంగా...  తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని పాలకొల్లు, కాకినాడ, భీమవరం, వెంప, ఏలూరు, తాడేపల్లిగూడెం, గుడివాడ తదితర ప్రాంతాల్లో జోరుగా కోడి పందేలు సాగుతున్నాయి. ఈ ఉదయం ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన అభయంతో తొలుత కత్తులు కట్టని పందేలను ప్రారంభించిన నిర్వాహకులు, ఆపై కత్తులు కట్టడం ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కలవపూడిలో కత్తులు కట్టిన విషయం తెలుసుకున్న పోలీసులు, లాఠీ చార్జ్ చేసి అక్కడి పందెంరాయుళ్లను తరిమి కొట్టడంతో తాత్కాలికంగా పందేలు ఆగిపోయాయని తెలుస్తోంది.