దేవయానికి ఎంపీ టికెట్టిస్తారట...

 

 

 

ఇళ్ళు కాలి ఒకడేడుస్తుంటే...చలిమంట వేసుకుంటాం అన్నట్టుంది దేశంలో రాజకీయ పార్టీల తీరు. మనదేశపు మహిళా దౌత్యాధికారి 'దేవయాని'కి జరిగిన అవమానం అమెరికా భారత్ ల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే౦త స్థాయికి చేరిన విషయం తెల్సిందే. 'దేవయాని'పై అమెరికా అధికారులు తీరును నిరసించిన భారత్, క్షమాపణతో పాటు ఆమెపై అక్రమ౦గా బనాయించిన కేసుల్ని సైతం ఎత్తేయాలని డిమాండ్ చేస్తోంది.

 


మరోవైపు తన కూతురి పట్ల అగ్రరాజ్యం వ్యవహరించిన పద్దతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న 'దేవయాని' తండ్రి ఉత్తమ్ క్షమాపణ,కేసుల ఉపసంహరణ కోరుతూ ఆమరణ దీక్షకు సైతం దిగుతానని హెచ్చరిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పాటు పలు స్వచ్చంద సంస్థలు అమెరికా వైఖరికి వ్యతిరేకంగా ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నాయి.



ఇంత గందరగోళ౦ నేలకొంటుంటే..సమాజ్ వాదీ పార్టీల అవన్నీ  వదిలేసి 'దేవయాని'కి పార్టీ టిక్కెట్ ఆఫర్ చేసింది. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలని ఆ పార్టీ చూడడం సిగ్గుచేటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు...ఇటీవల సచిన్ టెండూల్కర్ ను సైతం రమ్మంటూ సమాజ్వాదీ పార్టీ ఆహ్వానించడాన్ని వీరు గుర్తు చేస్తూ పార్టీ సిద్దాంతాల మీద కాకుండా వ్యక్తుల పాప్యులారీటీ మీద ఆధారపడి ఆ పార్టీ నడవాలనుకుంటో౦దని అంటున్నారు.