సల్మాన్ ను దోషిగా తేల్చిన కోర్టు..


కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ కు కోర్టు షాకిచ్చింది. ఈ కేసులో తుది తీర్పును నేడు రాజస్థాన్ లోని జోథ్ పూర్ కోర్టు వెలువరించింది. ఈ కేసును విచారించిన కోర్టు.. జింకలను చంపడం మానవత్వం కాదని.. కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ను దోషిగా నిరార్ధించింది. ఇంకా ఈ కేసులో నిందితులుగా ఉన్న సహా నటులను నిర్థోషులుగా తేల్చింది కోర్టు. కాసేపట్లో కోర్టు శిక్షను ఖరారు చేయనుంది.

 

కాగా 20 సంవత్సరాల క్రితం, 1988లో జోధ్ పూర్ పరిసర ప్రాంతాల్లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలీ బింద్రేలతో కలసి పాల్గొన్న వేళ, వేటకు వెళ్లి కృష్ణ జింకలను సల్మాన్ వేటాడాడన్నది ప్రధాన అభియోగం.