సల్మాన్ ఖాన్ నిర్దోషి..

 

అక్రమాయుధాల కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. అక్రమాయుధాల కేసు నుండి సల్మాన్ కు విముక్తి లభించింది. ఈ కేసులో ఈరోజు విచారణ జరిపిన జోథ్ పూర్ సెషన్ కోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది.

 

కాగా 1998 అక్టోబర్లో అనుమతి లేకుండా మారణాయుధాలు వినియోగించి వన్య ప్రాణులను వేటాడినందుకు గాను సల్మాన్పై నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు కేసుల్లో సల్మాన్ నిర్దోషిగా రుజువవ్వగా ఇప్పుడు మూడో కేసులో తీర్పు వెలువడింది. అనుమతి లేకుండా .22 రైఫిల్, .32 రివాల్వర్ కలిగి ఉన్న కేసులో సల్మాన్పై నమోదైన కేసులో సల్మాన్ ను నిర్దోషిగా చెబుతూ కోర్టు నేడు తీర్పునిచ్చింది.