ఈసీకి వివరణ ఇచ్చిన సాక్షి మహరాజ్..

Publish Date:Jan 11, 2017

 

బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 6న మీరట్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని దేశ జనాభా పెరగడంపై మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈసీ సాక్షి మహరాజ్ కు నోటీసులు జారీ చేసింది.  బుధవారంలోగా సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో తామే ఎలాంటి సమాచారం లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సాక్షి మహరాజ్ ఈరోజు ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.... సభలో తాను జనాభా నియంత్రణ గురించే మాట్లాడానని... ఏ వర్గం పేరును తాను ప్రస్తావించలేదని అన్నారు. మహిళలు పిల్లలను కనే యంత్రాలు కాదని... దేశంలో జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయినా తాను మాట్లాడింది ఎన్నికల ర్యాలీలో కాదని...  సాధువులు ఏర్పాటు చేసిన సభలో అని చెప్పారు.

By
en-us Politics News -