సహారా డైరీ కేసులో మోడీకి ఊరట...

Publish Date:Jan 11, 2017


సహారా డైరీ కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీనియ‌ర్ లాయ‌ర్ ప్ర‌శాంత్ భూష‌ణ్ వేసిన పిటిష‌న్‌పై మ‌రోసారి విచార‌ణ జ‌రిపిన కోర్టు..పిటిషన్ ను కొట్టివేసింది. స‌రైన సాక్ష్యాధారాలు లేని కార‌ణంగా ఈ కేసును విచారించ‌లేమ‌ని .. ఇకపై కేసులో స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌తో విచార‌ణ ఉండ‌బోద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టంచేసింది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న ఆరోపణలు కూడా తొలగిపోయినట్టు అయింది. కాగా సహారా, బిర్లాల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గ‌తంలో న‌వంబ‌ర్ 14న విచార‌ణ సంద‌ర్భంగా కూడా కోర్టు ఇదే అభిప్రాయం వ్య‌క్తంచేసింది. మరి ఇన్ని రోజులు దీనిని ఉద్దేశించి మోడీపై విమర్శలు చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.

By
en-us Politics News -