సదావర్తి భూములపై సుప్రీంకోర్టుకెళ్లిన తమిళనాడు

తమిళనాడులోని కాంచీపురంలో సదావర్తి సత్రానికి చెందిన భూములపై గత కొద్ది రోజులుగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భూములకు మరోసారి వేలం నిర్వహించాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. అయితే ఆ వేలాన్ని నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ భూములతో ఆంధ్రప్రదేశ్‌కి ఎటువంటి సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొంది. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను నామమాత్రపు ధరకు వేలం వేయడంపై పిటిషన్ దాఖలు కావడంతో సుప్రీం వాటిని మరోసారి వేలం వేయాలని తీర్పు నిచ్చింది. ఇప్పుడు ఇదే విషయంపై తమిళనాడు అభ్యంతరం తెలుపుతుండటంతో మరోసారి సదావర్తి వ్యవహారం ఆసక్తికరంగా మారింది.