రోజా మౌనం వెనుక కారణం ఇదే....!

 

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా ఎక్కడ.. ఎక్కడ..? ఇప్పడు అందరి ఆలోచిస్తుంది ఇదే. ఎందుకంటే ఎప్పుడు సమయం దొరుకుతుందా.. ఎప్పుడు టీడీపీపై.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శలు చేద్దామా అని చూసే రోజా ఇప్పుడు కనిపించడం లేదు. నంద్యాల ఉపఎన్నికలో రోజా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రోజా పార్టీ అధినేత జగన్ కుంటే ఎక్కువే టీడీపీపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు అఖిల ప్రియ డ్రస్సింగ్ విషయంలో కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆఖరికి ఏమైంది ఓటమి రుచి చూడాల్సి వచ్చింది. దాంతో కాకినాడ ఎన్నికల్లో కాస్త నోటి దురుసును తగ్గించింది. కానీ కాకినాడ ఎన్నికల్లో కూడా ఓడిపోయింది. వెరసి మొత్తానికే రోజా సైలెంట్ అయిపోయింది. నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చింది కూడా తక్కువే. దీనికి కారణం వైసీపీ అధిష్ఠానమేనట. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు ఎన్నికలకు కారణం జగన్ తో పాటు రోజా చేసిన వ్యాఖ్యలు కూడా కారణమని భావిస్తున్నారు వైసీపీ నేతలు. ఎన్నికలలో వ్యతిరేక ఫలితాలు రావడానికి రోజా చేసిన వ్యాఖ్యలే కారణమని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు సైలెంట్ గా ఉండాలంటూ పార్టీ హైకమాండ్ ఆమెకు సూచించిందట. అందుకన్న మాట రోజా సైలెంట్ అయింది. లేకపోతే ఈ పాటికి ప్రెస్ మీట్ లు పెడుతూ నానా హడావుడి చేసేది..