బాబోయ్.. చంద్రబాబుకు వర్మ కౌంటర్... నిజాలనే తీస్తా..!

 

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విషయంలో తెలుగుదేశం నేతలు వర్సెస్ రామ్ గోపాల్ వర్మ అన్నట్టుగా మాటల యుద్ధం సాగుతున్న విషయం విదితమే. ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడుతున్నా వారికి రివర్స్ కౌంటర్లు ఇస్తున్న రామ్ గోపాల్ వర్మ.. చంద్రబాబుపై కూడా కౌంటర్లు వేస్తారా అని అందరూ ఎదురు చూశారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై వస్తున్న వివాదాలను టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా... ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై వాస్తవాలకు విరుద్ధంగా ఎవరు సినిమా తీసినా ప్రజలు ఆమోదించరని... ఎన్టీఆర్‌ ఎవరో, ఆయన జీవితంలో జరిగిన పరిణామాలేమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని... సినిమాపై తెదేపా నేతలెవరూ ఇష్టానుసారంగా మాట్లాడొద్దని సూచించారు. ఇక మిగతా తెలుగుదేశం నేతలపై కౌంటర్లు వేసినట్టుగానే.. చంద్రబాబు నాయుడిపై కూడా కౌంటర్లు వేశాడు. లక్ష్మి’స్ ఎన్టీఆర్ లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు అన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి మాటలు ముమ్మాటికీ నిజం ..అందుకనే నేను నిజంగా జరిగిన నిజాలనే ఏ మాత్రం వక్రీకరించకుండా తియ్యబోతున్నాను అని కౌంటర్ ఇచ్చాడు. CBN గారన్నట్టు NTR జీవితం తెరిచిన పుస్తకమే..కాని లక్ష్మి’స్ ఎన్టీఆర్ లో నేను ఆ పుస్తకం లోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలని తిరిగి అతికించబోతున్నాను.’’మరి ముఖ్యమంత్రిగారికే వర్మ సెటైర్ వేశాడు.. మరి మిగిలిన నేతలు ఇది దృష్టిలోపెట్టుకోనైనా వర్మను కెలక్కుండా ఉంటారో..? లేదో..? చూద్దాం...