టీఆర్ఎస్ పంతం నెగ్గింది.. రేవంత్ రెడ్డి ఓటమి

 

తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓడిపోయారు. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి తిరుగులేదు.. భారీ మెజారిటీతో మళ్ళీ ఆయనే గెలుస్తారు అనుకున్నారు. కానీ టీఆర్ఎస్ వ్యూహాలు ఫలించి ఆ అంచనాలు తారుమారయ్యాయి. టీఆర్ఎస్.. కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతల నియోజకవర్గాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో కొడంగల్ కూడా ఒకటి. రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకున్నారు. కానీ ఆ ఆశలు ఆవిరైపోయాయి. కొడంగల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన టీఆర్ఎస్.. రేవంత్ రెడ్డికి పోటీగా, మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి లాంటి బలమైన అభ్యర్థికి బరిలోకి దింపింది. రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని వ్యూహాలు రచించిన టీఆర్ఎస్ దానికితగ్గట్టే రేవంత్ రెడ్డిని ఓడించి పంతం నెగ్గించుకుంది.