ఓటమి భయంలో రేవంత్ రెడ్డి... ఎవర్ని కాకా పడుతున్నాడో తెలుసా..?

 

రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేయడం.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి కొడంగల్ ఉపఎన్నికపైనే. ఎవరికి వారు వ్యూహాలు రచించుకుంటున్నారు. అయితే అసలు ఉపఎన్నిక జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి కూడా ఉంది. దానికి కారణం.. రేవంత్ రెడ్డి రాజీనామాను చంద్రబాబుకు ఇవ్వడమే.. మరి చంద్రబాబు ఈ రాజీనామా లేఖను స్పీకర్ కు అందిస్తారా..? లేదా..? అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇదంతా ఒక స్టోరీ. ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికర విషయం బయటపడింది. అదేంటంటే...ఈ మధ్య రేవంత్ రెడ్డి ఓ కుటుంబం చుట్టూ తెగ చక్కర్లు కొడుతున్నాడట. ఎప్పుడూ చూడూ వారితోనే ఉంటున్నాడట..? వాళ్లు నందారం అనురాధ, నందారం ప్రశాంత్.. ఇంతకీ ఎవరిది ఆ కుటుంబం.. రేవంత్ రెడ్డి అంతలా వాళ్ల చుట్టు ఎందుకు తిరుగుతున్నాడో తెలుసుకోవాలంటే కాస్త ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే.

 

కొడంగల్ నియోజక వర్గంలో నందారం ఫ్యామిలీ గురించి తెలియని వాళ్లుండరు. అక్కడ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి భారీ ఓటు బ్యాంకు ఉంది. అలాంటి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినదే ఈ నందారం ఫ్యామిలీ. ఈ సామాజిక వర్గానికి చెందిన కీల‌క‌మైన నాయ‌కుడు నందారం వెంకటయ్య. ఆయ‌న‌కు గతంలో తెదేపా టిక్కెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించింది. నందారం వెంకటయ్య మరణాంతరం ఆయన కుమారుడు నందారం సూర్యనారాయణకు సైతం తెదేపా ఎమ్మెల్యేగా గెలిపించింది. ఈయన భార్యనే నందారం అనురాధ.. నందారం కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వారి మంచితనం.. అవినీతి రహిత పాలన అక్కడి ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. దీంతో ప్రజల్లో వారికి చక్కటి సానుభూతి వచ్చింది. ప్రమాదంలో నందారం సూర్యనారాయణ ఎమ్మెల్యే హోదాలో మరణించారు. దీంతో కొడంగల్‌లో ఈ కుటుంబానికి ప్రజలు మరింత దగ్గరయ్యారు. ఆతరువాత తెదేపా కోడంగల్‌ సీటును రేవంత్‌రెడ్డి చేతిలో పెట్టింది. సూర్యనారాయణ సోదరుడు నందారం శ్రీనివాస్‌ కుమారుడు నందారం ప్రశాంత్‌ కోడంగల్‌ రాజకీయాలలో మరింత కీలకంగా మారిపోయారు. దీంతో రేవంత్ రెడ్డి వీరి కుటుంబం చుట్టూ తిరుగుతున్నాడట. మరోవైపు ఉపఎన్నికల్లో ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి వారిని కాకా పట్టేందుకు ఇలా చేస్తున్నాడని అంటున్నారు రాజకీయవిశ్లేషకులు... మొత్తానికి నాకు తిరుగులేదు అనుకున్న రేవంత్ రెడ్డికి కూడా ఓడిపోతానేమో అన్న భయం పట్టుకుందన్నమాట.. చూద్దాం మరి ఏం జరుగుతుందో...