రాహుల్ కు టచ్ లో రేవంత్ రెడ్డి....

 

తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి ఇప్పటికే చాలా మంది నేతలు జంప్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు టీఆర్ఎస్ పెద్దలు కూడా సీనియర్ నాయకులను తమ పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక దీనిలోభాగంగానే టీడీపీ నేత రేవంత్ రెడ్డి పేరు కూడా పార్టీ మారతారు అని చాలా సార్లు వినిపించింది. రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని.. దానికి రేవంత్ రెడ్డి ఆ వార్తల్లో నిజం లేదు... నేను పార్టీ మారేది లేదని చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఈ వార్త తెరపైకి వచ్చింది. అయితే ఈసారి పార్టీ పేరు మారింది. కాంగ్రెస్ పార్టీ. ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని… కాంగ్రెస్ కూడా ఆయన వైపే చూస్తోందని ఆయనకు సన్నిహితంగా ఉండే వాళ్లు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ ను గట్టిగా ఎదిరించే నాయకుడిగా, రెడ్డి సామాజికవర్గానికి చెందిన బలమైన లీడర్ గా రేవంత్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. అందుకే ఆయనను పార్టీలోకి తీసుకోవాలని కాంగ్రెస్ లోకి కొందరు నాయకులు, మరీ ముఖ్యంగా అధిష్టానానికి దగ్గరగా ఉండే మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి హైకమాండ్ కు సూచించాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చంద్రబాబుతో కలిసి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో... ఆయన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని కలుస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలను రేవంత్ రెడ్డి ఖండిస్తారో..?లేదో..? చూద్దాం..