రాజధానిలో మొదటి వేడుకలు.. విశాఖలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవ వేడుకల్ని విశాఖ సాగర తీరంలో నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. ఆర్కే బీచ్ రోడ్ లో రిపబ్లిక్ డే పరేడ్ ప్రాక్టీస్ ని నిర్వహిస్తున్నారు. గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పాల్గొంటారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 14 కమిటీలు వేసి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రిపబ్లిక్ డే రోజు పరేడ్ లో పాల్గొనే కంటెంజెన్సీ బీచ్ రోడ్ లో సన్నధ కవాతు నిర్వహించారు. ఎనిమిది కంటింజెన్సీ ఇప్పటికే విశాఖకు చేరుకుని రిహార్సల్స్ ప్రారంభించాయి. 

రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా విశాఖలోని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత తొలి రిపబ్లిక్ డే వేడుకలు కూడా విశాఖలో నిర్వహిస్తుండటం విశేషం. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 25 వరకు బీచ్ రోడ్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బీచ్ రోడ్ లో ఉదయం 5:30 నుంచి 11:30 వరకు..అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5:30 నిమిషాల వరకు రిపబ్లిక్ డే పరేడ్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఆయా సమయాల్లో బీచ్ రోడ్ లో ట్రాఫిక్ ను మళ్ళిస్తున్నరు. ఆర్కే బీచ్ ఏరియాలో నివాసముండే వాళ్లకు రాకపోకల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.