మీకు జియో ఉందా..? అయితే మీ పంట పండినట్లే..!!

జియో వినియోగదారులపై ఆఫర్ల వర్షం కొనసాగుతూనే ఉంది. భారతదేశ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన ఖాతాదారులను మరింత పెంచుకునేందుకు.. తన కస్టమర్లు ఇతర టెలికాం కంపెనీలకు మళ్లీపోకుండా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా తన ప్రైమ్ కస్టమర్ల కోసం ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను విడుదల చేసింది. ఈ స్కీమ్ కింద రూ.399 లేదా ఆపైన రీచార్జ్ చేసుకునే ప్రైమ్ మెంబర్స్‌కు.. రీచార్జ్ చేసుకున్న ప్రతీసారి రూ.2,599 విలువగల క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఈ క్యాష్‌బాక్‌ను మూడు రకాలుగా రిలయన్స్ జియో విభజించింది.

 

మై జియోలో జమచేసేలా ఎనిమిది ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ వోచర్లు ఇవ్వనుంది. ఒక్కో దాని విలువ రూ. 50. దీనితో పాటు మొబైల్ వ్యాలెట్లోకి రూ.300 క్యాష్‌బ్యాక్ వోచర్లు.. ఈ కామర్స్‌లో షాపింగ్ చేసుకునేందుకు ఉద్దేశించిన రూ.1,899 విలువైన ఓచర్లు ఉన్నాయి. ఈ ఆఫర్ నవంబర్ 10 నుంచి 25 వరకు ఓపెన్‌ చేసి ఉంటుంది. ఇందుకోసం దేశంలోని ప్రధాన ఈ-వ్యాలెట్ కంపెనీలైన అమెజాన్ పే, పేటీఎం, ఫోన్‌పే, మొబిక్విక్, యాక్సిస్ పే, ఫ్రీచార్జ్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది. అన్నట్లు నవంబర్ 15 నుంచి క్యాష్‌బ్యాక్ వోచర్లు వినియోగదారుల ఖాతాల్లో జమకావడం ప్రారంభమవుతుందని జియో వెల్లడించింది.