వ్యాట్ రద్దుపై సంతకం చేస్తా:జగన్

posted on: Jan 27, 2012 5:39PM

నర్సరావుపేట:వ్యాట్ని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా నర్సరావుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యాట్ రద్దుపై సంతకం చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ హామీ ఇచ్చారు.దేశంలో కనీవిని ఎరుగని రీతిలో 5 శాతం వ్యాట్ పెంచారని, లక్షన్నర దుకాణాలపై ఈ ప్రభావం పడుతుందన్నారు. వ్యాట్ పెంపు వల్ల ఒక్కో కుటుంబంపై ఏడాదికి 14 వందల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పారు.పన్నుల రూపంలో దోచుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టడంలేదన్నారు. సోనియా గాంధీ మెప్పు పొందడమే వారికి ముఖ్యం అన్నారు. వ్యాట్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని జగన్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించే సమయం వచ్చిందన్నారు.ధర్నా కార్యక్రమంలో వస్త్ర వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ సూపరింటెండెంట్కు జగన్ వినతి పత్రం అందజేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...