సునీల్‌రెడ్డికి రెండున్నర రోజులు సీబీఐ కస్టడి

posted on: Jan 27, 2012 5:22PM

 హైదరాబాద్:ఎమ్మార్ కుంభకోణం కేసులో అరస్టయిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమీప బంధువు సునీల్‌రెడ్డిని రెండున్నర రోజులపాటు సీబీఐ కస్టడీకి నాంపల్లి ప్రత్యేక కోర్టు శుక్రవారం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. శనివారం ఉదయం కస్టడీలోకి తీసుకుని సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టులో హాజరు పరచాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.సునీల్‌రెడ్డి తరపు న్యాయవాది సుశీల్‌కుమార్‌ సిబిఐకి సంబంధించి పలు కీలక అంశాలను కోర్టు ముందుంచారు. నోటీస్‌ జారీ చేయకుండానే సునీల్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారని, అంతకంటే ముందు ఒక్కసారి కూడా కనీసం విచారించలేదని తెలిపారు. అసలు నోటీసులే ఇవ్వకుండా పారిపోతారని సిబిఐ ఎలా ఊహించిందని సుశీల్‌కుమార్‌ ప్రశ్నించారు. సెర్చ్‌ మెమో లేకుండా సునీల్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారని, ఈ తనిఖీల్లో ఏమి దొరికిందన్న విషయం వెల్లడించలేదని చెప్పారు.ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సెక్షన్లను వర్తింపచేయడానికి సునీల్‌ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగి కాదనే విషయాన్ని గమనించాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు వాదనలు ముగిసిన తరువాత సునీల్‌ రెడ్డిని రెండున్నర రోజులపాటు సిబిఐ కస్టడీకి అప్పజెబుతూ కోర్టు అనుమతిచ్చింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...