Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...15రోజుల్లో పదవికి గుడ్ బై జగన్ ఎమ్మెల్యే కాపు
posted on: Jan 27, 2012 8:31AM
హైదరాబా
ద్: కొన్ని రాజకీయ కారణాల వల్ల మరో 15..20 రోజుల్లోపు ఎమ్మెల్యే పదవి నుండి స్వచ్ఛందంగా వైదొలగనున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి గురువారం ప్రకటించారు. గురువారం రాయదుర్గం పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన మాట్లాడారు. తనకు శాసనసభ్యుడి హోదాలో బహుశా ఇదే చివరి కార్యక్రమం కావచ్చునన్నారు. అతి తక్కువ సమయం ఉన్న వ్యక్తి తానే అని, అయినా ప్రజలకు చేతనైన సహాయం చేశానని చెప్పారు. విజయవంతమైన ఎమ్మెల్యే కాకపోయాననే బాధ ఉందన్నారు. ప్రజలకు సేవలు చేసేవాడిగా ఉంటానని అన్నారు. దేశంలో ఉన్న కుళ్లంతా రాజకీయ నాయకుల్లోనే ఉండిపోయిందన్నారు. నన్ను మీవాడిగా ఆదరిస్తారని భావిస్తున్నానని అన్నారు. నియోజకవర్గంలో అతి తక్కువ కాలం ఎమ్మెల్యే హోదాలో కొనసాగిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతానన్నారు. తన ఆస్తి వివరాలు ఎవరైనా సమాచార హక్కు, చట్టం ద్వారా పొందవచ్చునని తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అభివృద్ధి పనులు చేపట్టలేక పోవడంపై బాధ కలుగుతోందన్నారు. కాగా ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో పార్టీ విప్ ధిక్కరించి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే.



.jpg)


