అభిమానులకు చెప్పా బాలకృష్ణ

posted on: Jan 26, 2012 3:23PM

హైదరాబాద్: అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాలను కూల్చడం, దిష్టిబొమ్మల దహనం లాంటి కార్యక్రమాలకు పాల్పడవద్దని అభిమానులకు చెప్పానని  హీరో నందమూరి బాలకృష్ణ మీడియాకు తెలిపారు. కూల్చివేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మోతీనగర్‌లోని నీలిమా హస్పిటల్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బాలకృష్ణ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల్లో బాపు, రమణల పేర్లు లేకపోవడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...