మాఫియా డబ్బుతో అధికారంలోకి:బాబు

posted on: Jan 26, 2012 1:55PM

హైదరాబాద్: మాఫియా  సంపాదించిన డబ్బుతో అధికారంలోకి రావడం దురదృష్టకరమని  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  విమర్శించారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మైనింగ్, ఇసుక, లిక్కర్ మాఫియాల డబ్బులతో అధికారంలోకి వస్తున్నారని    అవినీతిలేని సమాజం కోసం యువత కృషి చేయాలని సూచించారు. పదవులు, అధికారం కోసం కులాలు, మతాలు, ప్రాంతాలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. 65 ఏళ్ల స్వాతంత్ర్యం, 63 ఏళ్ల గణతంత్రంలో మనం ఏం సాధించామో సమీక్షించుకోవాలన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలు, ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం సరికాదని, దీనిని అందరూ ఖండించాలన్నారు.భారత్ సూపర్ పవర్‌గా ఎదిగేందుకు అందరూ కృషి చేయాలన్నారు. క్యాన్సర్‌లా పెరుగుతున్న అవినీతిని అంతమొందించేందుకు అందరూ పాటుపడాలన్నారు. అవినీతే దేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య అన్నారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నారు. సామాజిక న్యాయం కోసం, పేదరికం లేని సమాజం కోసం అందరూ కృషి చేయాలన్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...