రాజకీయ పార్టీలకు జగన్ సవాల్

posted on: Jan 26, 2012 1:46PM

హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన సునీల్ రెడ్డికి తనకు ఉన్న బంధుత్వాన్ని నిరూపించాలని రాజకీయ పార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్‌లో సీబీఐను పావుగా వినియోగించుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. దీనిపై జగన్ మాట్లాడుతూ కుళ్లు రాజకీయాలతో తనను, తన కుటుంబాన్ని అప్రదిష్టపాలు చేసేకంటే కాల్చి చంపండంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్‌ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మార్‌ విల్లాల కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేసిన సునీల్‌రెడ్డి తనకు బంధువంటూ జరుగుతున్న ప్రచారాన్ని జనం సాక్షిగా ఖండించారు. తనకు ఆయనకు ఉన్న బంధుత్వాన్ని సీబీఐతో పాటు.. ఇతర రాజకీయ పార్టీలు నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు

google-ad-img
    Related Sigment News
    • Loading...