Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ కేసులో సీబీఐ కీలక నిర్ణయం సాయికి నార్కో టెస్ట్!
posted on: Jan 25, 2012 1:54PM
హైదరాబాద్:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన జగతి పబ్లికేషన్ ప్రతినిధి విజయసాయి రెడ్డికి నార్కో పరీక్షలు నిర్వహించాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.గతంలో పలుమార్లు ఆయనను విచారించినప్పటికీ, రిమాండులోకి తీసుకొని విచారిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో సమాధానాలు రాబట్ట లేకపోతున్నందున నార్కో టెస్టుకు అనుమతించాలని కోరారు.నార్కో టెస్ట్‌కు అనుమతించకపోతే, ఈ కేసు మరుగుపడే అవకాశం ఉందని సీబీఐ కోర్టుకు విన్నవించింది. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై విచారణను జనవరి 30వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.






