టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి..

 

గత కొద్దికాలంగా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేరిపోతారని.. ఇంకాసేపట్లో చేరిపోతారని.. కొంతమంది అయితే చేరిపోయారని ఇలా ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు ఆవార్తలు నిజం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతున్నారు. అతి త్వరలోనే శ్రీకాంత్ రెడ్డి టీడీపీలో చేరుతారని అంటున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన వైకాపాపై అసంతృప్తితో ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డి సీటు ఇవ్వకుండా పార్టీలో కొందరు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని.. జగన్ కు ఆ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలో టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్దమయ్యారనే వార్తలు వస్తున్నాయి.