డిఎల్‌ దారెటూ..?

మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయటంతో ఇప్పుడు అందరి దృష్టి డిఎల్‌ రవీంద్రారెడ్డి నెక్ట్స్‌ స్టెప్‌ మీదే ఉంది.. చాలా కాలంగా కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చెవిలో జోరిగగా తయారైన డిఎల్‌ రవీంద్రారెడ్డిని కిరణ్‌ అధిష్టానం అండదండలతో చావు దెబ్బ కొట్టాడు.. దీంతో ఇప్పుడు డిఎల్‌ భవిష్యత్తు డైలమాలో పడింది..

 

ravindra reddy, DL ravindra reddy, Minister ravindra reddy, dl ravindra reddy minister

 
అయితే డిస్‌మిస్‌కు గురైన డిఎల్‌ కాంగ్రెస్‌ నేతల నుంచి మంచి మద్దత్తు అందుతుంది.. ముఖ్యంగా కిరణ్‌ వ్యతిరేఖ వర్గంతో పాటు పిసిసి చీఫ్‌ బొత్సాతో పాటు చిరంజీవిలాంటి నాయకులు బహిరంగంగానే డిఎల్‌కు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఈ సందర్భంలో డిఎల్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగాలా లేక పార్టీని వీడాలన్న విషయం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు..
 
అయితే ఇప్పటికే డిఎల్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నట్టుగా ప్రచారం మొదలైంది.. మొదట వైఎస్సార్‌ ప్రాణ స్నేహితుడిగా ముద్రపడ్డ  డిఎల్‌ తరువాత జగన్‌ రాజకీయ ప్రవేశంతో ఆయనకు దూరం అయ్యారు.. 2009 ఎలక్షన్స్‌ తరువాత ఆ అంతరం మరింత పెరిగింది అయితే  తాజా పరిణామాలతో మరోసారి డిఎల్‌ వైయస్‌ కుటుంబానికి దగ్గరవుతున్నట్టుగా కనిపిస్తుంది..
 
అందుకు తగ్గట్టుగానే డిఎల్‌ ఇటీవల ఓ బహిరంగ సభలో ‘కాంగ్రెస్‌ పెద్దలు నా ప్రాణ స్నేహితుడి కుమారిడి మీద నన్ను పోటి చేయించారు’ అంటూ కాంగ్రెస్‌ నేతలపై విరుచుపడ్డారు.. ప్రస్తుతం అమలవుతున్నవన్ని వై యస్‌ పథాకాలే అంటూ రాజశేఖర్‌ రెడ్డిని కీర్తించారు.. ఈ పరిణామాలన్నీ డిఎల్‌ అడుగులు వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపే అన్నట్టుగా ఉన్నాయి..
 
ravindra reddy, DL ravindra reddy, Minister ravindra reddy, dl ravindra reddy minister
 
అయితే కొంతమంది డిఎల్‌ తెలుగు దేశం పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు.. ఇప్పటికే కడప జిల్లా నుంచి వైయస్‌ కుటుంబంతో పాటు మైసూరా రెడ్డి కూడా వైయస్సార్‌ కాంగ్రెస్‌లో ఉండటంతో తాను అదే పార్టీలో చేరితే సముచిత స్థానం దక్కకపోవచ్చని భావిస్తున్నాడట.. అదే సమయంలో టిడిపి పార్టీలో మైసూరా వెళ్లిపోవడంతో కడప జిల్లాలో నాయకత్వం లేమి ఏర్పడటంతో ఆ గ్యాప్‌ డిఎల్‌ భర్తి చేయాలని భావిస్తున్నాడని అంటున్నారు..
 
 డిఎల్‌ రవీంద్రా రెడ్డి మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాల తరువాత తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానంటున్నాడు..